అభిమాన హీరోలను చూడటానికి , స్వయంగా కలవడానికి ఏకంగా 1400 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేసాడు సాగర్ అనే అభిమాని. తెలంగాణ ప్రాంతానికి చెందిన సాగర్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. అలాగే కరోనా కష్టకాలంలో అభినవ దాన కర్ణుడిగా పేరొందిన సోనూ సూద్ అంటే కూడా ఇష్టమేనట. సోనూ సూద్ చేసిన సేవలకు గాను మురిసిపోయిన సాగర్ తెలంగాణ నుండి ముంబైకి సైకిల్ మీద వెళ్ళాడు. అక్కడ సోనూ సూద్ ను కలిసాడు.
ఇక సీనియర్ హీరో కృష్ణ చనిపోవడంతో మహేష్ బాబు ను కలిసి సానుభూతి వ్యక్తం చేయాలని భావించిన సాగర్ మళ్ళీ ముంబై నుండి సైకిల్ మీద ప్రయాణం చేస్తూ హైదరాబాద్ కు చేరుకున్నాడు. మహేష్ ను కలవడానికి వచ్చానని తెలిపాడు. మొత్తానికి తన అభిమాన హీరోలను కలవడానికి ఏకంగా 1400 కిలోమీటర్లకు పైగా సైకిల్ మీద ప్రయాణించడం విశేషం.