2022 పూర్తి కాబోతోంది. ఈ ఏడాదిలో అన్ని వెర్షన్ లు కలిపి ఇప్పటి వరకు 220 కి పైగా సినిమాలు విడుదల కాగా మరో మూడు వారాల్లో మరో 20 సినిమాలకు పైగా విడుదల కానున్నాయి. ఇక ఇప్పటి వరకు విడుదలైన చిత్రాల్లో డిజాస్టర్ మూవీస్ గా చరిత్ర సృష్టించిన సినిమాలు కొన్ని ఉన్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రాలు అత్యంత దారుణమైన ఫలితాలను చవి చూశాయి. దాంతో బయ్యర్లు దారుణంగా నష్టపోయారు. ఒకసారి ఆ డిజాస్టర్ సినిమాల లిస్ట్ చూద్దామా !
1) ఆచార్య : మెగాస్టార్ చిరంజీవి , రాంచరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలయ్యింది. చిరంజీవి కెరీర్ లోనే డిజాస్టర్ గా నిలిచింది. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
2) లైగర్ : రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఛార్మి – కరణ్ జోహార్ నిర్మించారు.
3) ది ఘోస్ట్ : కింగ్ నాగార్జున హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాడు. భారీ యాక్షన్ విజువల్స్ తో వచ్చిన ఈ చిత్రం నాగార్జున కెరీర్ లోనే డిజాస్టర్ గా నిలిచింది.
4 ) సన్ ఆఫ్ ఇండియా : మోహన్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రానికి కనీస ఓపెనింగ్స్ కూడా దక్కలేదు. మొదటి రోజునే ఈ చిత్రాన్ని చాలా థియేటర్ లలో తీసేసారు. అంతేకాదు చాలా షోలు ప్రేక్షకులు లేక రద్దయ్యాయి కూడా .
5 ) ఖిలాడి : రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ కొట్టబోతోంది అంటూ రకరకాల జిమ్మిక్కులు చేశారు. కట్ చేస్తే డిజాస్టర్ గా నిలిచింది.