తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. SSMB28 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్ర బడ్జెట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యింది. ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా ……. 220 కోట్ల బడ్జెట్ అట. ఈ మాట విని చాలామంది షాక్ అవుతున్నారు. అయితే ఇందులో రెమ్యునరేషన్ లకే 130 కోట్లకు పైగా అవుతోందట.
మహేష్ బాబు , త్రివిక్రమ్ , పూజా హెగ్డే అలాగే ఇతర నటీనటులు , టెక్నీషియన్ల రెమ్యునరేషన్ అంతా కలిపి 130 కోట్ల బడ్జెట్ అవుతోందట. ఇక మిగతా బడ్జెట్ షూటింగ్ కోసం అయ్యే ఖర్చు . అంటే ఓవరాల్ గా 220 కోట్ల బడ్జెట్ అంటే మాములు విషయం కాదు. అయితే ఇప్పుడు మన తెలుగు సినిమాల రేంజ్ పూర్తిగా మారిపోయింది. పాన్ ఇండియా రేంజ్ లో ఉంది కాబట్టి ఈ బడ్జెట్ వర్కౌట్ అవ్వడం ఖాయమని భావిస్తున్నారు.
అలాగే ఓటీటీ , శాటిలైట్ , డిజిటల్ రైట్స్ రూపంలోనే ఈ సినిమాకు 150 కోట్ల వరకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే థియేట్రికల్ రైట్స్ రూపంలో 130 కోట్లకు పైగా బిజినెస్ అవ్వడం ఖాయం. అంటే ఏ రకంగా చూసినా ఈ బడ్జెట్ వర్కౌట్ అవ్వడం ఖాయం. అయితే థియేట్రికల్ గా భారీ వసూళ్లు వస్తేనే ఈ సినిమాను కొన్న బయ్యర్లు సేఫ్ అవుతారు. ఇంతకుముందు త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబినేషన్ లో అతడు , ఖలేజా చిత్రాలు వచ్చాయి. ఆ చిత్రాలు అంతగా ఆడలేదు. దాంతో ఈ భారీ బడ్జెట్ అనేది చర్చనీయాంశంగా మారింది.