బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ ఓ ఫిట్ నెస్ ట్రైనర్ ని ప్రేమిస్తోంది. అయితే ఇన్నాళ్లు వాళ్ళ ప్రేమ విషయాన్ని వెల్లడించలేదు కానీ తాజాగా ప్రేమలో ఉన్నట్లు అలాగే త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు ఇద్దరూ. ఫిట్నెస్ ట్రైనర్ అయిన నుపుర్ శిఖారే అమీర్ ఖాన్ వద్ద ఫిట్నెస్ ట్రైనర్ గా పనిచేసాడు.
అయితే ఆ సమయంలో ఐరా ఖాన్ పరిచయమయ్యింది. కొద్దిరోజుల్లోనే ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దాంతో అప్పటి నుండి తరచుగా కలుస్తూనే ఉన్నారు ……. ఫోటోలకు ఫోజు ఇస్తూనే ఉన్నారు. అంతేనా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది ఐరా ఖాన్. ఇక సోషల్ మీడియాలో పెట్టే ఫోటోలు చూసి రకరకాల కామెంట్స్ చేస్తూనే ఉన్నారు నెటిజన్లు.
ఇక అసలు విషయానికి వస్తే …….. తాజాగా నుపుర్ శిఖారే సైక్లింగ్ పోటీల కోసం విదేశాలకు వెళ్ళాడు. అతడి వెంట ఐరా ఖాన్ కూడా వెళ్ళింది. ఇంకేముంది ఆ పోటీలలో పాల్గొన్న తర్వాత నేరుగా ఐరా దగ్గరకు వచ్చి కిస్ ఇచ్చి హగ్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా ? అంటూ ఓ రింగ్ ఆమె వెలికి తొడిగాడు……. ఇక ఐరా కూడా క్షణం ఆలస్యం చేయకుండా ఎస్ ….. చెప్పింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత రెండేళ్లుగా ఐరా – నుపుర్ సహజీవనం చేస్తున్నారు. ఇక త్వరలోనే పెళ్లి కానున్నట్లు తెలుస్తోంది. వీళ్ళ ప్రేమ విషయం బహిరంగంగా వెల్లడించడంతో బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.