సూపర్ స్టార్ కృష్ణతో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు సీనియర్ నటులు చంద్రమోహన్. ఒక దశలో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు కూడా. తాజాగా JSW & Jaiswaraajya సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు చంద్రమోహన్. JSW & Jaiswaraajya అధినేత మరియు UBlood app సృష్టికర్త డాక్టర్ జై యలమంచిలి అలాగే JSW & Jaiswaraajya సంస్థల డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్ ఇద్దరూ కలిసి చంద్రమోహన్ ను ఇంటర్వ్యూ చేయడం విశేషం.
1966 నా జీవితంలో మర్చిపోలేని సంవత్సరమని ఎందుకంటే నటుడిగా జన్మనిచ్చిన సంవత్సరం అంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. హీరోగా నటించిన రంగుల రాట్నం నా మొదటి చిత్రమని , ఆ సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో అలాగే జాతీయ స్థాయిలో అవార్డులను కూడా సాధించిందని ఆనందాన్ని వ్యక్తం చేసారు.
ఇక సుదీర్ఘమైన సినీ ప్రస్థానంలో ఆనాటి స్టార్ హీరోలైన ఎన్టీఆర్ , అక్కినేని , శోభన్ బాబు , కృష్ణ , కృష్ణంరాజు లతో మరచిపోలేని మధురానుభూతులు ఉన్నప్పటికీ కృష్ణతో ఉన్న అనుబంధం మాత్రం ప్రత్యేకమైనది అంటూ డాక్టర్ జై యలమంచిలి, డాక్టర్ శివకుమార్ ఆనంద్ లతో పంచుకున్నారు. కృష్ణ నటజీవితానికి సంబంధించిన అన్ని విషయాలు నాతో పంచుకునేవాడని , అలాగే కుటుంబ విషయాలను కూడా నాతో ఎక్కువగా చెప్పుకునే వాడని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు.
కృష్ణ – విజయనిర్మల ప్రేమ – పెళ్లి విషయాలను కూడా గుర్తు చేసుకున్నారు చంద్రమోహన్. సూపర్ స్టార్ కృష్ణ నిజంగానే ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి అందుకే ఎన్టీఆర్ , అక్కినేని లతో పోటీ పడి మరీ కొన్ని చిత్రాలను చేసాడని , ఇక సంచలనాలకు తెలుగునాట కేంద్ర బిందువుగా నిలిచింది ముమ్మాటికీ కృష్ణ మాత్రమే అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. తెలుగు సినిమాను సాంకేతికంగా కొత్త పుంతలు తొక్కించిన వ్యక్తి , శక్తి కృష్ణ మాత్రమే ! అంటూ ఆ అరుదైన రికార్డ్ తెలుగు సినిమా ఉన్నంత కాలం కృష్ణ పేరు మారుమ్రోగుతూనే ఉంటుందన్నారు.
చంద్రమోహన్ భార్య ప్రముఖ రచయిత్రి జలంధర రాసిన పలు రచనలను డాక్టర్ జై యలమంచిలి , డాక్టర్ శివకుమార్ ఆనంద్ లకు ఇచ్చారు. ఎన్నో ….. ఎన్నెన్నో విషయాలు ఈతరానికి తెలియాలని అందుకు ఇలాంటి రచనలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. అలాగే కృష్ణ సూపర్ స్టార్ గా ఎదగడంలో విజయనిర్మల కృషి ఎంతగానో ఉందన్నారు చంద్రమోహన్.
JSW & Jaiswaraajya సంస్థల అడ్వైజర్ మరియు UBlood app సృష్టికర్త డాక్టర్ జై యలమంచిలి సూపర్ స్టార్ కృష్ణ వీరాభిమాని అని తెలుసుకొని ఆయనతో మరిన్ని విషయాలు పంచుకున్నారు. అలాగే రక్తదాతల సమగ్ర సమాచారంతో రూపొందిన UBlood app ని సృష్టించిన డాక్టర్ జై యలమంచిలి పై ప్రశంసల వర్షం కురిపించారు. హీరోగా , కమెడియన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు చలనచిత్ర చరిత్రలో తనకంటూ ఓ చరిత్రను లిఖించుకున్న సీనియర్ నటులు చంద్రమోహన్ ను ఇంటర్వ్యూ చేయడం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు డాక్టర్ జై యలమంచిలి , డాక్టర్ శివకుమార్ ఆనంద్.
ప్రముఖ నటులు చంద్రమోహన్ తో డాక్టర్ జై యలమంచిలి , డాక్టర్ శివకుమార్ ఆనంద్ ఇంటర్వ్యూ పూర్తి భాగం కింద యూట్యూబ్ లింక్ లో చూడగలరు.