
టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ఇటీవల కాలంలో టాలీవుడ్ లో వరుస మరణాలు సంభవించిన విషయం తెలిసిందే. కృష్ణ , కృష్ణంరాజుల మృతితో టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకోగా వాళ్ళ మరణవార్త నుండి కోలుకోకముందే మరొక మరణవార్త వినాల్సి వచ్చింది. సీనియర్ నటుడు హరనాథ్ కూతురు , నిర్మాత జి. వి. జి. రాజు భార్య పద్మజా రాజు (54 ) ఈరోజు మధ్యాహ్నం ( డిసెంబర్ 20 న ) గుండెపోటుతో మరణించింది.
60- 70 వ దశకంలో హరనాథ్ హీరోగా పలు చిత్రాల్లో నటించాడు. అప్పటి తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడైన హీరో హరనాథ్ అనే చెప్పాలి. ఆయనే కూతురే ఈ పద్మజా రాజు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ” గోకులంలో సీత ” , ” తొలిప్రేమ ” వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించారు జి. వి. జి. రాజు. ఆయన భార్యే ఈ పద్మజ రాజు.
తండ్రి , భర్త సినిమారంగంలోనే పేరుప్రఖ్యాతులు పొందిన వాళ్ళు కావడంతో తన ఇద్దరు కొడుకులను కూడా నిర్మాతలుగా పరిచయం చేయాలని అనుకుంది పద్మజా రాజు. అయితే ఈలోగానే అనూహ్యంగా గుండెపోటుతో మరణించింది. దాంతో నిర్మాత GVG రాజుకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు సినీ ప్రముఖులు.