హీరో కృష్ణ ఆరోగ్యం విషమంగా ఉందని తేల్చిచెప్పారు డాక్టర్లు. నిన్న రాత్రి కృష్ణ అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారు. దాంతో గచ్చిబౌలి లోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. కృష్ణ గతకొంత కాలంగా కాంటినెంటల్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతుండటంతో వెంటనే స్పందించి ఆయన ఆరోగ్యం గురించి పూర్తి వివరాలు తెలిసి ఉండటంతో చికిత్స అందించారు. కార్డియాక్ అరెస్ట్ నుండి కృష్ణ కోలుకున్నారు కానీ ఇప్పుడే ఏమి చెప్పలేమని , మొత్తంగా 48 గంటలు గడిస్తే మాత్రమే చెప్పగలమని …… అప్పటి వరకు దేవుణ్ణి ప్రార్ధించాల్సిందే అని స్పష్టం చేశారు డాక్టర్లు.
డాక్టర్ల ప్రకటనతో ఒక్కసారిగా అభిమానుల్లో తీవ్ర కలకలం చెలరేగింది. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు కృష్ణ. ప్రస్తుతం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందున కృష్ణ కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉంది. ఇక అభిమానులు #get well soon Krishna అంటూ సోషల్ మీడియాలో వేడుకుంటున్నారు.