రేసుగుర్రం విలన్ రవికిషన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రవికిషన్ సోదరుడు రామ్ కిషన్ శుక్లా గుండెపోటుతో మరణించాడు. ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకునే నా సోదరుడు మరణించాడంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు ఎంపీ రవికిషన్. తీవ్ర అస్వస్థతకు గురైన రామ్ కిషన్ శుక్లా ను ముంబై లోని నానావతి ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మరణించాడని తీవ్ర దుఃఖసాగరంలో మునిగాడు రవికిషన్.
భోజ్ పురి చిత్రాల్లో హీరోగా నటించే రవికిషన్ రేసుగుర్రం చిత్రంతో టాలీవుడ్ లో అడుగు పెట్టాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో రవికిషన్ కు చాలా అవకాశాలే వచ్చాయి. ఇక 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గోరఖ్ పూర్ పార్లమెంట్ స్థానం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించాడు. పార్లమెంట్ లో అడుగుపెట్టాడు. 2024 లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయడానికి సంసిద్ధం అవుతున్నాడు.