కర్ణాటక రౌడీ షీటర్ రాకేష్ శెట్టి తో నన్ను చంపించడానికి రమ్య రఘుపతి ప్రయత్నాలు చేస్తోందని సంచలన ఆరోపణలు చేస్తూ కోర్టును ఆశ్రయించాడు సీనియర్ నటుడు నరేష్. గతకొంత కాలంగా నరేష్ – రమ్య రఘుపతి ల మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. రమ్య రఘుపతిని సీనియర్ నరేష్ మూడో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
అయితే గతకొంత కాలంగా రమ్య – నరేష్ ల మధ్య తీవ్ర విబేధాలు నెలకొనడంతో ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. అయితే ఇదే సమయంలో మరో నటి పవిత్ర లోకేష్ తో నరేష్ సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. నరేష్ విడాకులు కావాలని కోరుతున్నాడు కానీ రమ్య మాత్రం విడాకులు ఇవ్వడం లేదు. దాంతో ఇటీవల కాలంలో తరచుగా వివాదాలు జరుగుతూనే ఉన్నాయి.
అయితే నరేష్ పవిత్ర లోకేష్ ను త్వరలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో మరోసారి వివాదం తలెత్తింది. ఈ వ్యవహారంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు జరుగుతున్నాయి. తాజాగా నరేష్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. తనని చంపడానికి కర్ణాటక రౌడీ షీటర్ రాకేష్ శెట్టి తో తనని చంపడానికి రెక్కీ కూడా నిర్వహించిందని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించాడు నరేష్. ఈ వివాదం గతకొంత కాలంగా సీరియల్ లా సాగుతున్నాయి.