
మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. ఆస్కార్ అవార్డుల వేడుక కోసం అమెరికా వెళ్లిన చరణ్ ఈరోజు అమెరికా నుండి భారత్ తిరిగి వచ్చేసాడు. అయితే నేరుగా హైదరాబాద్ రాకుండా ఢిల్లీకి చేరుకున్నాడు. ఇండియా టుడే కాంక్లేవ్ కు హాజరు అవుతున్నాడు చరణ్. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ , హోం శాఖా మంత్రి అమిత్ షా , సచిన్ టెండూల్కర్ లతో పాటుగా చరణ్ కు కూడా పాల్గొనే అవకాశం లభించింది.
ఈరోజు రాత్రి 9:30 గంటలకు చరణ్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ఆస్కార్ వచ్చిన తర్వాత ఇండియాలో అడుగుపెట్టడమే కాకుండా మొదటిసారిగా మన మీడియా ముందుకు వస్తున్నాడు చరణ్. దాంతో ఢిల్లీలో గ్రాండ్ వెల్కమ్ దక్కింది చరణ్ కు. ఈ కార్యక్రమం అయ్యాక రేపు హైదరాబాద్ చేరుకోనున్నాడు.