తనదైన మేనరిజంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు సంపూర్ణేష్ బాబు. హీరోగా , కమెడియన్ గా పలు చిత్రాల్లో నటించిన సంపూను ఎన్టీఆర్ ఒకదశలో ఆదుకున్నాడు. ఎన్టీఆర్ కనుక జోక్యం చేసుకోకపోతే తీరని అన్యాయం జరిగి ఉండేది. ఎన్టీఆర్ జోక్యం చేసుకోవడంతో 25 లక్షల జరిమానా నుండి బయటపడ్డాడు. సంపూ ఏంటి ? ఎన్టీఆర్ ఆదుకోవడం ఏంటి ? జరిమానా ఏంటి ? అని అనుకుంటున్నారా ?
అసలు విషయం ఏంటంటే ………. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ షో మొట్టమొదటి సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. కాగా ఆ సీజన్ లోనే సంపూర్ణేష్ బాబు పాల్గొన్నాడు. అలాగే నటుడు సమీర్ కూడా పాల్గొన్నాడు. అయితే పక్కా పల్లెటూరికి చెందిన సంపూర్ణేష్ బాబు బిగ్ బాస్ హౌజ్ లో ఉండలేకపోయాడు. దాంతో నేను ఈ హౌజ్ లో ఉండలేను అంటూ బాగా ఏడ్చాడట.
నన్ను ఎలాగైనా సరే బయటకు పంపించండి …….. లేదంటే గోడలు దూకి , బద్దలు కొట్టుకొని మరీ వెళ్తాను అని చెప్పాడట. అయితే బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లడమే తప్ప రావడం ఉండదు …… అంటే ఎలిమినేషన్ ద్వారా మాత్రమే బయటకు రావడం తప్ప నేను వెళ్ళిపోతా అంటే ఒప్పుకోరు. ఒకవేళ అలా వెళ్లాల్సి వస్తే 25 లక్షలు కట్టి వెళ్ళాలి.
అయితే సంపూ బాధను అర్ధం చేసుకున్న ఎన్టీఆర్ బిగ్ బాస్ నిర్వాహకులతో మాట్లాడి జరిమానా అంశాన్ని పక్కకు తప్పించాడట. ఎన్టీఆర్ రిక్వెస్ట్ తో బిగ్ బాస్ నిర్వాహకులు సంపూ కు ఎలాంటి జరిమానా విధించకుండా బయటకు వెళ్లేలా చేశారట. ఈ విషయాన్ని నటుడు సమీర్ ఇప్పుడు చెబుతున్నాడు. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ మొదటి సీజన్ హైదరాబాద్ లో కాకుండా మహారాష్ట్ర లోని అటవీ ప్రాంతంలో సెట్ వేశారు. ఇక రెండో సీజన్ నుండి హైదరాబాద్ లోనే చేస్తున్నారు.