ఊహా – శ్రీకాంత్ లు విడాకుల రచ్చ సాగుతోంది సోషల్ మీడియాలో. మొదట ఈ వార్తను శ్రీకాంత్ పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇటీవల కాలంలో వైరల్ గా మారడంతో ఎట్టకేలకు స్పందించాడు. విడాకుల వార్తలను ఖండించాడు శ్రీకాంత్. ఇలాంటి వార్తలను ఎవరు ? ఎందుకు పుట్టిస్తారో తెలియదు ఇది బాధాకరం అంటూ తీవ్ర ఆవేదన వెలిబుచ్చాడు శ్రీకాంత్.
మేమంతా హాయిగా ఉన్నాం …… మాలాంటి జంట విడాకులు తీసుకోబోతోంది అంటూ కొన్ని వెబ్ సైట్ లలో అలాగే యూట్యూబ్ ఛానల్స్ లో రాయడం మమ్మల్ని తీవ్రంగా కలిచి వేసిందని ….. ఇలాంటి పుకార్లను పుట్టించిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. 90 వ దశకంలో హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించింది ఊహ. ఇక శ్రీకాంత్ కు జోడీగా పలు చిత్రాల్లో నటించింది. ఆ సమయంలోనే ఊహా – శ్రీకాంత్ లు ప్రేమలో పడ్డారు.
పెద్దల ఆశీర్వాదంతో 1997 లో ఊహ – శ్రీకాంత్ లు పెళ్లి చేసుకున్నారు. 25 ఏళ్ల కాపురంలో సహజంగానే కొన్ని కలతలు రావడం సహజం. అయినా జీవన ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ ఇద్దరికీ ముగ్గురు సంతానం. పెద్ద కొడుకు రోహన్ హీరోగా కూడా పరిచయమైన విషయం తెలిసిందే. ఎలాంటి సమయంలో విడాకుల వార్తలు శ్రీకాంత్ – ఊహ లను తీవ్రంగా కలిచి వేసింది.