
నందమూరి తారకరత్న అర్దాంతరంగా చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేవలం 40 ఏళ్ల వయసులోనే తనువు చాలించడంతో తారకరత్న అభిమానులు శోకసంద్రంలో మునిగారు. తారకరత్న చేతిపై ఓ టాటూ ఉండేది. ఆ టాటూ గురించి అప్పట్లో రివీల్ చేసాడు కానీ అప్పుడు అంతగా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు తారకరత్న మరణించడంతో తారకరత్న టాటూ గురించి చర్చ సాగుతోంది.
ఇంతకీ ఆ టాటూ సంగతి ఏంటో తెలుసా ……. తారకరత్న కు బాబాయ్ నందమూరి బాలకృష్ణ అంటే ఎనలేని అభిమానం. పేరుకు ఆయన బాబాయ్ కానీ అంతకంటే ఎక్కువగా అభిమానిగానే ఇష్టపడతాడు. అందుకె సింహం గుర్తును టాటూగా వేసుకున్నాడు. అలాగే దాని కింద బాలయ్య బాబాయ్ ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నాడు.
ఇప్పుడు ఈ టాటూ వైరల్ గా మారింది. బాలయ్య బాబాయ్ అంటే తారకరత్న కు ఇంత అభిమానమా ? అని చర్చించుకుంటున్నారు నందమూరి అభిమానులు. తారకరత్న అంటే బాలయ్యకు కూడా చాలా చాలా ఇష్టం. అందుకే తారకరత్న ఆసుపత్రిలో చేరగానే వెంటనే ఆసుపత్రికి చేరుకొని దగ్గరుండి మరీ అన్ని విషయాలు చూసుకున్నాడు.
కుప్పం నుండి బెంగుళూరు కు తరలించి మెరుగైన వైద్యం అందించడానికి పూనుకున్నాడు. అలాగే తారకరత్న బాగుండాలని , కోలుకోవాలని చాలా ప్రయత్నాలే చేసాడు. అలాగే ప్రతీ వారం బెంగుళూర్ వెళ్లి యోగక్షేమాలు తెలుసుకున్నాడు. అంతేకాదు నిన్నటి రోజున మహాశివరాత్రి పర్వదినం అయినప్పటికీ …… తారకరత్న ఆరోగ్యం విషమించిందని తెలియగానే హుటాహుటిన బెంగుళూర్ వెళ్ళాడు. ఇది బాబాయ్ – అబ్బాయ్ ల మధ్య ఉన్న అనుబంధం.