టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. టీవీ సుబ్బారావు నిన్న రాత్రి మృతి చెందాడు. పలు సీరియల్ లలో అలాగే పలు చిత్రాల్లో నటించాడు టీవీ సుబ్బారావు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో , పలు సీరియల్ లలో నటించిన సుబ్బారావు కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వయసు మీద పడటంతో పాటుగా ఇతర కారణాలతో మరణించాడు. టీవీ సుబ్బారావు మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక ఈరోజు డిసెంబర్ 22 న హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో టీవీ సుబ్బారావు అంత్యక్రియలు జరుగనున్నాయి.
Breaking News