80 – 90 వ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన భామ భానుప్రియ. తెలుగు , తమిళ , కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. కృష్ణ , శోభన్ బాబు , చిరంజీవి, బాలకృష్ణ , నాగార్జున, వెంకటేష్ తదితర స్టార్ హీరోల సరసన నటించింది భానుప్రియ. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ ల సరసన ఎక్కువగా నటించింది. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా దక్షిణాదిన సత్తా చాటింది. అయితే స్టార్ హీరోయిన్ గా ఉండగానే ఓ ఫోటోగ్రాఫర్ ను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది.
ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి సెకండ్ ఇన్గింగ్స్ స్టార్ట్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో పలు ఇబ్బందులు పడుతోంది భానుప్రియ. ఎందుకంటే గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. దాంతో అవకాశాలు వస్తున్నప్పటికీ నటించడానికి ఆసక్తి చూపించడం లేదు. పైగా ఇటీవల ఓ తమిళ సినిమా షూటింగ్ లో డైలాగ్స్ అన్నీ మర్చిపోయిందట. దాంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అచేతనంగా ఉండి పోయిందట. అందుకే ఇకపై ఆరోగ్యం పై దృష్టి పెట్టి సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెబుతోంది. తన భర్త గుండెపోటుతో మరణించడంతో కూడా కొంత డిప్రెషన్ కు గురైనట్లు చెబుతోంది భానుప్రియ.