
నాభర్త మొదటి పెళ్లి పెటాకులు కావడానికి నేను కారణం అంటూ మీడియాలో రకరకాల వార్తలు రాసారని , కానీ అందుకు నేను కారణం కాదు అని అంటోంది హాట్ భామ హన్సిక మోత్వాని. సోహైల్ అనే వ్యాపారవేత్తను గత ఏడాది 2022 డిసెంబర్ 4 న పెళ్లి చేసుకుంది హన్సిక. అయితే సోహైల్ కు అంతకుముందే పెళ్లి అయ్యింది. పైగా సోహైల్ భార్య ఎవరో కాదు …… హన్సిక స్నేహితురాలు కావడం విశేషం.
అంతేకాదు సోహైల్ కు తన స్నేహితురాలుకు పెళ్లి అయినప్పుడు హన్సిక చేసిన సందడి అంతాఇంతా కాదు. కట్ చేస్తే సోహైల్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు …… ఇపుడేమో హన్సిక ను పెళ్లి చేసుకున్నాడు. దాంతో హన్సిక వాళ్ళ కాపురంలో నిప్పులు పోసిందని అందువల్లే వాళ్ళు విడిపోయారని మీడియాలో రకరకాల కథనాలు వెలువడ్డాయి.
అంతేకాదు హన్సిక ఆ సమయంలో వాళ్లతో కలిసి దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసారు. దాంతో మరింత రచ్చ రచ్చ అయ్యింది. కట్ చేస్తే ఇపుడు ఈ విషయం మీద స్పందించింది. నాభర్త విడాకులకు నేను కారణం కాదు అంటూ చెప్పుకొచ్చింది. అయితే మీడియాలో నాపై దుష్ప్రచారం చేయడంతో నేను చాలా బాధపడ్డాను. నాభర్త నా ఫ్రెండ్ తో విడిపోయిన మాట వాస్తవమే ! కానీ అందుకు మాత్రం నేను కారణం కాదు అని అంటోంది. అయితే ఈ వ్యవహారం అంతా చూసిన వాళ్ళు మాత్రం హన్సిక తప్పు లేదంటే నమ్మడం లేదు మరి.