
అన్నదానం ఆకలిని తీర్చుతుంది కానీ…….. రక్తదానం ఒక ప్రాణాన్ని నిలుపుతుందని , అలాంటి వేలాది ప్రాణాలకు జీవం పోయాలంటే UBlood App ని డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది సీనియర్ నటి ఇంద్రజ. ఆపరేషన్ లలో అలాగే రోడ్డు ప్రమాదాలలో సరైన సమయానికి రక్తం అందక వేలాది ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయని , అలాంటి సంఘటనలకు చక్కని పరిష్కారం UBlood App అని అంటోంది ఇంద్రజ. 90 వ దశకంలో తెలుగునాట స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన భామ ఇంద్రజ. కృష్ణ , బాలకృష్ణ , నాగార్జున తదితర స్టార్ హీరోలతో తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. ఆలీ హీరోగా నటించిన యమలీల చిత్రంతో ప్రభంజనం సృష్టించింది ఇంద్రజ. నీ జీను ప్యాంట్ చూసి బుల్లెమ్మో అనే పాట ఇప్పటికీ మారుమ్రోగుతూనే ఉందనే విషయం తెలిసిందే.
ఇక యు బ్లడ్ యాప్ విషయానికి వస్తే …… డాక్టర్ జై యలమంచిలి , కృష్ణమూర్తి యలమంచిలి ప్రజల కోసం , ఈ సమాజం కోసం ఎలాంటి లాభాపేక్ష లేకుండా అద్భుతమైన యాప్ ను అందిస్తున్నారు. ప్రతీ రోజూ ఏదో ఒక యాప్ ను ప్రజలు డౌన్ లోడ్ చేసుకునే ఉంటున్నారు…… కానీ UBlood యాప్ మాత్రం ప్రజల ప్రాణాలను నిలబెట్టే యాప్ కాబట్టి తప్పనిసరిగా ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని అందులో మీ వివరాలు పొందుపరిస్తే రక్తదానం అవసరమైన సమయాన రక్తం ఇవ్వడానికి సహాయకారిగా ఉంటుంది. అదే సమయంలో రక్తగ్రహీతల సమాచారం కూడా ఉంటుంది కాబట్టి ఇది ఉభయ కుశలోపరిగా సర్వమానవాళికి సహాయకారిగా ఉంటుందన్నారు.
కరోనా కష్టకాలంలో హీరోగా నిలిచిన సోనూ సూద్ UBlood app కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం సంతోషించదగ్గ పరిణామమని , డాక్టర్ జై యలమంచిలి సేవా భావంతో ఈ యాప్ ను తీసుకురావడం ఆయన గొప్ప మనసుకు తార్కాణమన్నారు ఇంద్రజ. JSW & jaiswaraajya.tv సంస్థల కమ్యూనికేషన్ మేనేజర్ చిలువేరు శంకర్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు ఇంద్రజ.