హైదరాబాద్ లో ” ది వ్యాక్సిన్ వార్ ” అనే షూటింగ్ జరుగుతోంది. కాగా ఆ షూటింగ్ లో నటి పల్లవి జోషి గాయపడింది దాంతో హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సంఘటన వివరాలలోకి వెళితే ……. ” ది కశ్మీర్ ఫైల్స్ ” వంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి దర్శకత్వం వహించిన ” వివేక్ అగ్నిహోత్రి ” తాజాగా ” ది వ్యాక్సిన్ వార్ ” అనే సినిమా రూపొందిస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో ఓ కారు వేగంగా వస్తూ అదుపుతప్పింది దాంతో నేరుగా పల్లవి జోషిని ఢీకొట్టింది. దాంతో పల్లవి జోషికి గాయాలయ్యాయి. దాంతో షాకైన చిత్ర బృందం వెంటనే పల్లవి జోషిని ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో యూనిట్ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.