చెన్నై లో జరిగిన పెళ్లిలో రచ్చ రచ్చ చేసింది ప్రగతి ఆంటీ. 80- 90 వ దశకంలో తమిళంలో హీరోయిన్ గా కొన్ని చిత్రాల్లో నటించిన ఈ భామ ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పింది. కట్ చేస్తే ఇద్దరు పిల్లలు అయ్యాక హీరో తల్లి పాత్రల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. స్టార్ హీరోలకు తల్లిగా , అత్తగా నటిస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది తన గ్లామర్ తో.
తాజాగా చెన్నై లో బంధువుల పెళ్లిలో రచ్చ రచ్చ చేసింది. ఏకంగా డోలు మీద కూర్చొని తీన్మార్ స్టెప్పులు వేస్తూ పిచ్చెక్కించింది. 46 ఏళ్ల వయసులో డోలు మీద కూర్చొని ప్రగతి ఆంటీ డ్యాన్స్ చేసిన విధానానికి హ్యాట్సాఫ్ అంటున్నారు కుర్రాళ్ళు. ప్రగతి చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట చేసింది. ఇంకేముంది ఆ వీడియో సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ప్రగతి ఆంటీకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ప్రగతి డ్యాన్స్ వీడియోల కోసం అలాగే ఆమె చేసే ఎక్సర్ సైజ్ కోసం కుర్రాళ్ళు ఆశగా ఎదురు చూస్తుంటారు. సినిమాల్లో క్లాస్ బయట మాస్ …… దాంతో ప్రగతికి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. తాజాగా తనకు పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలను అంగీకరిస్తోంది ఈ భామ.
View this post on Instagram