బాలీవుడ్ హాట్ భామ షామా సికిందర్ బాంబ్ పేల్చింది. సినిమాల్లో ఛాన్స్ లు రావాలంటే దర్శక నిర్మాతలతో బెడ్ షేర్ చేసుకోవాల్సిందేనని వ్యాఖ్యానించి కాస్టింగ్ కౌచ్ గురించి మరోసారి తేనెతుట్టెను కదిపింది. తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది షామా సికిందర్. ఆ సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేసి నిప్పు రాజేసింది.
నాకు కూడా కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురయ్యింది. నేను కొంతమంది సినిమాల్లో నటించలేదు. అయినప్పటికీ వాళ్ళు నాతో సన్నిహితంగా ఉండాలని , బెడ్ షేర్ చేసుకోవాలని మొహమాటం లేకుండా అడిగారు. నేను షాక్ అయ్యాను. అసలు నేను మీ సినిమాల్లో నటించలేదు కదా ! మరి ఎందుకు మీతో సన్నిహితంగా ఉండాలని ప్రశ్నించాను. దానికి అవకాశాలు రావాలంటే తప్పకుండా మామాట వినాల్సిందే అని చెప్పారని స్పష్టం చేసింది.
కొన్నాళ్ల క్రితం వరకు ఈ కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడున్న యువ దర్శక నిర్మాతలు కూడా తమ పక్కలో హీరోయిన్ లు పడుకోవాలని భావిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం హీరోయిన్ లకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. అయితే కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినిమా రంగంలోనే లేదు …….. అన్ని రంగాల్లో కూడా ఉంది. కాకపోతే సినిమా అనేది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఫోకస్ ఉంటుంది అంతే తేడా ! అని చక్కగా వివరిస్తోంది షామా సికిందర్.