ఎట్టకేలకు ప్రభాస్ అభిమానులకు శుభవార్త చెప్పారు దర్శకులు ఓం రౌత్. అక్టోబర్ 2 న అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా దర్శకులు ఓం రౌత్ ప్రకటించారు. దాంతో ప్రభాస్ అభిమానుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. చాలాకాలంగా ఆదిపురుష్ నుండి అప్ డేట్ కావాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.
అయితే వాళ్ళు ఎన్నిసార్లు డిమాండ్ చేసినప్పటికీ దర్శక నిర్మాతలు మాత్రం పట్టించుకోలేదు. దాంతో పెద్ద ఎత్తున నిరసన కూడా వ్యక్తం చేసారు. చాలా రోజులుగా ప్రభాస్ సినిమాల నుండి అప్ డేట్ కోరుతున్న అభిమానులకు ఎట్టకేలకు శుభవార్త చెప్పారు. దాంతో అక్టోబర్ 2 కోసం ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ 2 న ఆదిపురుష్ టీజర్ రానుంది. అలాగే వచ్చే ఏడాది జనవరి 12 న సినిమా విడుదల కానుంది.
ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటించగా సీతగా కృతి సనన్ నటించింది. రావణాసురుడుగా సైఫ్ అలీఖాన్ నటించారు. ఇక మిగిలిన పాత్రల్లో దేవ్ దత్తా , సన్నీ సింగ్ , తృప్తి తదితరులు నటించారు. గ్రాఫిక్ వర్క్ ఎక్కువగా ఉండటంతో ఈ సినిమా ఆలస్యమైంది. మొత్తానికి డార్లింగ్ ఫ్యాన్స్ కోరిక నెరవేరి టీజర్ కు సిద్ధమైంది. మరో మూడు నెలలు గడిస్తే ఆదిపురుష్ విడుదల కానుంది.