డార్లింగ్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన చిత్రం ” ఆదిపురుష్ ”. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. సీతగా కృతి సనన్ నటించగా రావణాసురుడుగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటించాడు. ఇటీవలే అక్టోబర్ 2 న అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ విడుదల చేశారు. అయితే ఈ టీజర్ చూసిన వాళ్ళు ఇది బొమ్మల సినిమానా ? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో బాయ్ కాట్ ట్రెండ్ అవుతోంది ఆదిపురుష్ చిత్రంపై. గతంలో కూడా పలు బాలీవుడ్ చిత్రాలపై బాయ్ కాట్ అస్త్రాన్ని ప్రయోగించారు నెటిజన్లు. కట్ చేస్తే ఆ చిత్రాలన్నీ కూడా ఘోర పరాజయం పొందాయి. హిట్ అయిన సినిమాలేవీ లేవు. అయితే మిగతా సినిమాలను బాయ్ కాట్ చేయాలని పిలుపు ఇవ్వడానికి రకరకాల కారణాలు ఉండగా ఆదిపురుష్ చిత్రాన్ని బాయ్ కాట్ అని పిలుపు ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా ……. బొమ్మల సినిమాగా ఉందని భావించడమే !
ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ బొమ్మల సినిమాని తలపించేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు రాముడి గెటప్ లో ప్రభాస్ అంతగా బాగోలేడని , అలాగే రావణాసురుడు గెటప్ లో సైఫ్ అలీఖాన్ , ఆంజనేయుడు గెటప్ కూడా బాగోలేదని , ఏమాత్రం రామాయణం గురించి తెలియదా ? తెలియకుండా ఎలా తీశారు ? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక బీజేపీ వాళ్ళు కూడా ఈ సినిమాపై చాలా ఆగ్రహంగా ఉన్నారు. దాంతో సోషల్ మీడియాలో బాయ్ కాట్ ట్రెండ్ అవుతోంది. లక్కీ ఏంటంటే …… ఈ సినిమా విడుదలకు ఇంకా మూడు నెలల సమయం ఉంది కాబట్టి అప్పటి వరకు ఈ వివాదం సద్దుమణుగుతుందా ? లేదా ? అన్నది చూడాలి. 2023 జనవరి 12 న ఆదిపురుష్ చిత్రం విడుదల కానుంది.