
డార్లింగ్ ప్రభాస్ రాముడిగా నటించిన చిత్రం ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ , మోషన్ పోస్టర్ లు పెద్ద ఎత్తున వివాదాన్ని సృష్టించాయి. ప్రభాస్ గెటప్ అలాగే రావణుడిగా సైఫ్ అలీఖాన్ గెటప్ అలాగే హనుమంతుడి గెటప్ పై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అంతేకాదు యానిమేటెడ్ మూవీ ఎన్ని ఎందుకు చెప్పలేదు అంటూ ప్రభాస్ అభిమానులు అయితే ఓం రౌత్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
అన్ని వైపులా దారుణమైన విమర్శలు రావడంతో ఆదిపురుష్ చిత్రానికి రిపేర్లు చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. అందుకోసం మళ్ళీ భారీ బడ్జెట్ ను కేటాయించారట. ఆదిపురుష్ పై నెలకొన్న భారీ అంచనాలను రీచ్ అయ్యేలా కొన్ని రిపేర్లు చేయాలని భావించారట, అందుకే ఈ సినిమా ముందుగా అనుకున్నట్లుగా 2023 సంక్రాంతికి విడుదల అవ్వడం కష్టమే అని తెలుస్తోంది.
ప్రభాస్ రాముడిగా నటించగా సీత పాత్రలో కృతి సనన్ నటించింది. విజువల్స్ అన్ని కూడా తీవ్రంగా నిరాశపరచడంతో మెరుగులు దిద్దే పనిలో పడ్డారు. మరో ఈ రిపేర్ల వల్ల ఆదిపురుష్ బెటర్ అవుతుందా ? లేదా ? అన్నది చూడాలి.