
డార్లింగ్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన చిత్రం ఆదిపురుష్. సీతగా కృతి సనన్ నటిస్తుండగా రావణాసురుడుగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. కాగా ఈ సినిమా జూన్ 16 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పై వరుసగా వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. అన్ని అడ్డంకులు అధిగమిస్తూ జూన్ లో విడుదలకు సిద్ధమైంది.
సరిగ్గా ఇలాంటి తరుణంలోనే అరుదైన గౌరవం లభించింది ఆదిపురుష్ చిత్రానికి. జూన్ 13 , 2023 న ట్రిబెకా ఫెస్టివల్ లో ఆదిపురుష్ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. వివాదాల సుడిగుండంలో ఇదొక గౌరవం అనే చెప్పాలి. సినిమా విడుదలకు మూడు రోజుల ముందే ట్రిబెకా ఫెస్టివల్ ప్రీమియర్ షో వేయడం వల్ల పాజిటివ్ అంశంతో పాటుగా నెగెటివ్ అంశం కూడా ముడిపడిఉంది.
సినిమా బాగుంటే అది చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ బాగోలేకపోతే మాత్రం తప్పకుండా ఆ ప్రభావం ఓపెనింగ్స్ పై పడుతుంది. ఇక ఈ సినిమా రన్ టైం లాక్ అయ్యింది. ఇంతకీ ఆదిపురుష్ సినిమా రన్ టైం ఎంతో తెలుసా ……. 174 నిముషాలు. అంటే దాదాపుగా మూడు గంటలు అన్నమాట. ఈరోజుల్లో మూడు గంటల సినిమా అంటే ఎక్కువే ! కానీ రామాయణం గురించి కాబట్టి ఆ రన్ టైం ఉండాల్సిందే అని భావిస్తున్నారు.






