
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ 37 సంవత్సరాల తర్వాత ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకున్నాడు. 1985 లో విజయవాడలోని నాగార్జున యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చేసాడు వర్మ. అయితే ఇంజినీరింగ్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసినప్పటికీ డిగ్రీ పట్టా మాత్రం తీసుకోలేదు. ఎందుకంటే తనకు ఇంజినీరింగ్ వైపు వెళ్లాలని లేదు కాబట్టి. సినిమాల్లోకి వెళ్లాలని భావించిన వర్మ హైదరాబాద్ చేరుకొని మొదట ఓ వీడియో లైబ్రరీ పెట్టాడట.
ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టి అక్కినేని నాగార్జున హీరోగా శివ అనే చిత్రాన్ని రూపొందించాడు. శివ సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రను తిరగరాసింది. దాంతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు వర్మ. శివ హిట్ అవ్వడం లక్కీ ఏమి కాదు…… మూసధోరని లో వెళ్తున్న తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించిన సినిమా. అదిగో అప్పటి నుండి ఇప్పటి వరకు దర్శకుడిగా కొనసాగుతూనే ఉన్నాడు. వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాల్లో హిట్ శాతం తక్కువే….. కానీ అతడి ప్రభావం మాత్రం చాలా చాలా ఎక్కువ.
ఇక ఇంజనీరింగ్ డిగ్రీ పట్టా విషయానికి వస్తే…….. ఈరోజు నాగార్జున యూనివర్సిటీకి గెస్ట్ గా వెళ్ళాడు రాంగోపాల్ వర్మ. ఆ సందర్భంగా తన ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకున్నాడు. దాంతో చాలా ఎగ్జైట్ అయ్యాడు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పేర్కొన్నాడు వర్మ.