Amani తెలుగులో సావిత్రి తరువాత అంత పేరు తెచ్చుకున్న హీరోయిన్ సౌందర్య మాత్రమే. తన నటనతో అందరిని మెప్పించింది. ముప్పయి ఏళ్లకే ఆమెకు నూరేళ్లు నిండాయి. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారనే వార్త ప్రేక్షకులు తట్టుకోలేకపోయారు. ఆమె ఇక లేదనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ అభిమాన తార దివికేగిందనే విషయం విని షాక్ కు గురయ్యారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో గొప్ప పేరు సంపాదించుకుంది. మనవరాలి పెళ్లితో సినీ రంగ ప్రవేశం చేసినా రాజేంద్రుడు గజేంద్రుడుతో హిట్ అందుకుంది. ఇక తిరుగే లేదని నిరూపించుకుంది. నెంబర్ వన్, అన్నయ్య, హలోబ్రదర్, టాప్ హీరో, రాజా లాంటి సినిమాలతో తానేమిటో నిరూపించుకుంది. తెలుగులో తిరుగులేని హీరోయిన్ గా సత్తా చాటింది.
తెలుగులో సౌందర్యకు మంచి స్నేహితురాలు అంటే ఆమని. ఇద్దరిలో మంచి అవగాహన ఉండేది. ఒకరినొకరు పలకరించుకునే వారు. కబుర్లు చెప్పుకునే వారు. ఆమని పలు సందర్బాల్లో తనకు తెలుగులో మంచి మిత్రురాలు అంటే సౌందర్య అని చెప్పుకోవడం విశేషం. ఆమెకు ఇంకా ఎవరు ఉన్నారో లేరో కానీ నాకు మాత్రం సౌందర్య మంచి మిత్రురాలు అని చాటడం గమనార్హం.
సౌందర్య చనిపోయినప్పుడు ఆమని వెళ్లలేకపోయారు. నెల రోజుల తరువాత వారి ఇంటికి వెళితే ఇల్లు మొత్తం బూత్ బంగ్లాగా మారిందట. ఆమె చనిపోయాక అక్కడ ఎవరు ఉండకుండా ఎక్కడికో వెళ్లిపోయారట. ఇలా సౌందర్య మరణం అందరిని కలచివేసింది. ఈ నేపథ్యంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఓ అందమైన తారను పోగొట్టుకోవడం దురదృష్టం.