31.9 C
India
Sunday, April 19, 2026
More

    Agent Trailer: స్పై యాక్షన్ థ్రిల్లర్ తో అఖిల్.. గూస్ బమ్స్ పుట్టిస్తున్న ట్రైలర్..

    Date:

    Agent Trailer
    Agent Trailer

    Agent Trailer: ఇక టాలీవుడ్ లో అఖిల్ అక్కినేని హవా కొనసాగే టైం వచ్చిందని కింగ్ నాగార్జున అన్నారు. గతంలో చూసిన అఖిల్ వేరని ఇప్పుడు ‘ఏజెంట్’ వస్తున్న అఖిల్ ను చూస్తే ప్రతి ఒక్కరూ ఆశ్యర్యపోవడం ఖాయమని కింగ్ ప్రశంసించారు. అఖిల్ హీరోగా చేసిన స్పై యాక్షన్ మూవీ ట్రైలర్ భారీ వ్యూవ్స్ తో దూసుకుపోతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం (23.04.23)న వరంగల్ లోని రంగీలా గ్రౌండ్ లో నిర్వహిస్తున్నట్లు మూవీ యూనిట్ పేర్కొంది. దీనికి చీఫ్ గెస్ట్ గా నాగార్జున వస్తున్నారని యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

    ఈ చిత్రాన్ని 28 ఏప్రిల్ న రిలీజ్ చేసేందుకు అన్నాహాలు పూర్తయిన నేపథ్యంలో నాగార్జున అఖిల్ గురించి కొన్ని విషయాలు వివరించారు. అక్కినేని అఖిల్ టాలీవుడ్ ను షేక్ చేయడం ఖాయమని, గతంలో అఖిల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కే పరిమితం అయ్యాడు. కానీ ‘ఏజెంట్’ అఖిల్ థియేటర్లలో గూస్ బంబ్స్ పుట్టించడం ఖాయమని అన్నారు. ఈ సినిమా అఖిల్ జీవితంలో ది మోస్ట్ మూవీగా నిలుస్తుందని ఖచ్చితంగా చెప్తున్నానని నాగార్జున అన్నారు. పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్కినేని వారసత్వం నుంచి పాన్ ఇండియా లెవల్ లో విడుదలయ్యే మొదటి సినిమా అవుతుంది.

    ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పైన సుంకర రామబ్రహ్మం, సరెండర్ 2 మూవీ బ్యానర్ పై సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. వంశీ వక్కంతం కథ అందించగా దర్శకత్వం సురేందర్ రెడ్డి చేశారు. మలయాళ నటుడు సూపర్ స్టార్ మమ్ముట్టి ఏజెంట్ లో కీలక రోల్ లో కనిపిస్తున్నారు. సాక్షి వైద్య అఖిల్ సరసన నటించారు. అఖిల్ కెరీర్ లో కూడా ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ (ఏజెంట్) మూవీ ప్రత్యేకమని నాగ్ పొగడ్తలతో ముంచెత్తారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ఏజెంట్ ట్రైలర్ కు అద్భుత స్పందన

    అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ చిత్రం ఈనెల 28 న...