డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్ కు తలొగ్గింది ఆహా OTT. డార్లింగ్ ప్రభాస్ ఇంటర్వ్యూ ముందుగానే స్ట్రీమింగ్ కావాలి అని గట్టిగా డిమాండ్ చేశారు. అదేపనిగా సోషల్ మీడియాలో ఆహా ను టార్గెట్ చేయడంతో డార్లింగ్ ఫ్యాన్స్ కోరిక మన్నించాలని భావించింది. అందుకే రేపు స్ట్రీమింగ్ కావాల్సిన మొదటి ఎపిసోడ్ ను ఈరోజే లైవ్ లోకి తెస్తున్నారు. ఈ విషయాన్ని ఆహా టీమ్ అధికారికంగా ప్రకటించింది.
బాలయ్య అన్ స్టాపబుల్ షో దేశంలోనే నెంబర్ వన్ టాక్ షోగా నిలిచిన విషయం తెలిసిందే. ఇక బాలయ్య జోరుకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇమేజ్ తోడైతే ఇక చెప్పనలవి కాదు సుమా ! బాలయ్య – ప్రభాస్ ఎపిసోడ్ బాక్స్ లు బద్దలవ్వడం ఖాయం. బాహుబలి ఎపిసోడ్ కావడంతో దీన్ని రెండు భాగాలుగా ప్రసారం చేస్తున్నారు. మాములుగా అయితే డిసెంబర్ 30 న అనుకున్నారు. కానీ డార్లింగ్ ఫ్యాన్స్ అదేపనిగా డిమాండ్ చేయడంతో ఆహా తలొగ్గింది. ఈరోజు రాత్రి 9 గంటలకు Unstoppable with NBK సీజన్ 2 బాలయ్య – ప్రభాస్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.