నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. కరోనా మహమ్మారి విలయాన్ని సృష్టిస్తున్న సమయంలో థియేటర్ లకు ప్రేక్షకులు వస్తారో ? లేదో ? అనే అనుమానాల మధ్య అఖండ విడుదలై అఖండ విజయం సాధించింది. వసూళ్ల వర్షం కురిపించింది. బాలయ్య నటజీవితంలో మైలురాయిగా నిలిచింది.
కట్ చేస్తే …….. అఖండ చిత్రానికి సీక్వెల్ చేయడానికి రంగం సిద్ధం అవుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని డిసైడ్ అవ్వడమే కాకుండా తెరవెనుక గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. ఇందుకు ఉదాహరణే సంగీత దర్శకుడు తమన్ అందించిన ట్వీట్. నిన్న మహాశివరాత్రి కావడంతో మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ అఖండ 2 కు సర్వం సిద్ధం అని చెప్పకనే చెప్పాడు.
అంటే తెరవెనుక అఖండ 2 కు సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయన్న మాట. బోయపాటి శ్రీను ప్రస్తుతం రామ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే బాలయ్య కూడా అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నాడు. దాంతో ఈ ఇద్దరూ ఆ సినిమాలను పూర్తి చేసాక అఖండ సీక్వెల్ పట్టాలెక్కడం ఖాయమని భావిస్తున్నారు. బాలయ్య అఘోరగా అద్భుతమైన నటన ప్రదర్శించారు దాంతో అఖండ 2 పై భారీ అంచనాలు నెలకొనడం ఖాయం.