కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ . ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు ఫిబ్రవరి 13 న హైదరాబాద్ లో జరుగుతోంది. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అక్కినేని అఖిల్ హాజరు కానున్నాడు. కిరణ్ అబ్బవరం హీరోగా తనకంటూ ఓ మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక తాజాగా వినరో భాగ్యము విష్ణు కథ అనే చిత్రంలో నటించాడు. ఈ సినిమా ఫిబ్రవరి 18 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఆ నేపథ్యంలో ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అఖిల్ అక్కినేని ఈ బ్యానర్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అనే సినిమా చేసాడు. ఆ సినిమా హిట్ అయిన విషయం తెలిసిందే. దాంతో సెంటిమెంట్ గా అక్కినేని అఖిల్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.
Breaking News