అఖిల్ నటించిన మొట్టమొదటి చిత్రం ”సిసింద్రీ ” . శివ నాగేశ్వర్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకం పై నాగార్జున నిర్మించడం విశేషం. 1995 సెప్టెంబర్ 14 న ఈ చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాలో నాగార్జున స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చాడు అలాగే టబు కూడా ఓ పాటలో మెరిసి కుర్రాళ్లను అలరించింది.
అఖిల్ చిన్న వయసులోనే ఈ సినిమాలో నటించాడు. పూర్తిగా నడవటం రాదు అలాగే మాటలు కూడా రాని వయసులోనే సిసింద్రీ చిత్రంలో నటించి మెప్పించాడు. ఇక మిగిలిన పాత్రల్లో ఆమని , శరత్ బాబు , శివాజీరాజా , తనికెళ్ళ భరణి , సుధాకర్ , ఏవీఎస్ తదితరులు నటించారు.
1995 లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికి 27 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. దాంతో అప్పటి రోజులను తల్చుకుంటున్నారు ఆ చిత్రానికి పనిచేసిన నటీనటులు , సాంకేతిక నిపుణులు. అఖిల్ మొదటి చిత్రమే సూపర్ హిట్. అలాగే మనం చిత్రంలో కూడా స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయితే సోలో హీరోగా మాత్రం భారీ అపజయాలను మూటగట్టుకున్నాడు. హీరోగా సక్సెస్ కొట్టడానికి బాగానే తంటాలు పడుతున్నాడు.