
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ చిత్రం ఈనెల 28 న భారీ ఎత్తున విడుదల అవుతుండటంతో నిన్న రాత్రి ఏజెంట్ ట్రైలర్ ను విడుదల చేసారు. భారీ యాక్షన్ సీన్స్ తో ఉన్న ఏజెంట్ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. అఖిల్ అభిమానులు ఏజెంట్ ట్రైలర్ చూసి తప్పకుండా హిట్ అవుతుందన్న ఆశాభవాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక నెటిజన్లు కూడా ఏజెంట్ ట్రైలర్ కు ఫిదా అవుతున్నారు. అఖిల్ ను కొత్త కోణంలో చూసిన నెటిజన్లు తప్పకుండా ఈ చిత్రంతో సాలిడ్ హిట్ కొట్టడం ఖాయమని భావిస్తున్నారు. ఇక అఖిల్ కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలాకాలం అవుతోంది కానీ ఇంతవరకు సాలిడ్ హిట్ కొట్టలేకపోయాడు…… అక్కినేని అభిమానులను సంతృప్తి పరచలేకపోయాడు. దాంతో ఆ లోటు ఈ సినిమాతో తీరుతుందని భావిస్తున్నాడు.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28 న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏజెంట్ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించారు. ట్రైలర్ కు అద్భుత స్పందన వస్తుండటంతో ఏజెంట్ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించడం.






