పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ ల వారసుడు అకిరా నందన్ హైలెట్ గా నిలిచాడు హైదరాబాద్ లో జరిగిన ఈ ఫార్ములా కార్ రేసింగ్ పోటీలలో. అకిరా నందన్ ఈ కార్ పోటీలలో పాల్గొనలేదు సుమా …… కేవలం ఆ షో చూడటానికి వచ్చాడు అంతే. ఆరడుగులకు పైగా ఎత్తు ఉండటంతో పాటుగా నూనూగు మీసాలతో చూడముచ్చటగా ఉన్నాడు దాంతో అకిరా నందన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు.
అకిరా నందన్ ను హీరోగా పెట్టి టీనేజ్ లవ్ స్టొరీ సినిమా చేస్తే తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు. అంతేకాదు అకిరా నందన్ హైట్ కూడా చర్చకు వస్తోంది. ఆరున్నర అడుగుల వరకు ఉన్నాడు అకిరా….. దాంతో మెగా హీరో వరుణ్ తేజ్ కంటే ఎక్కువగా పొడవు ఉన్నాడని , అదే అకిరా నందన్ కు కలిసి వచ్చే అంశమని అంటున్నారు.
మొత్తానికి అకిరా నందన్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యాడు హైదరాబాద్ లో నిర్వహించిన ఈ కార్ రేసింగ్ వల్ల. ఈ షోకు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, క్రికెట్ వీరులు, వ్యాపార వేత్తలు హాజరయ్యారు. అయితే అందరికంటే ఎక్కువగా ఫేమస్ అయ్యింది……. స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది మాత్రం అకిరా నందన్ మాత్రమే. త్వరలోనే అకిరా నందన్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఖాయమని భావిస్తున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే అకిరా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.