
అక్కినేని నాగచైతన్య ఒక అమ్మాయితో కారులో రొమాన్స్ చేస్తుండగా పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఇంకేముంది పోలీసుల దగ్గర బాగానే బ్రతిమిలాడాడట దాంతో వార్నింగ్ ఇచ్చి వదిలేసారు పోలీసులు. ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు …… స్వయంగా నాగచైతన్య చెప్పడం విశేషం. అయితే ఈ సంఘటన ఇటీవల జరిగింది కాదు సుమా ! కొన్నాళ్ల క్రితం జరిగిన సంఘటన.
జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్ రోడ్ల మీద రయ్ రయ్ మంటూ ఖరీదైన కార్లలో తిరిగే మగమహారాజులు ఈ సంపన్న వర్గాలకు చెందిన వాళ్ళు. బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు అందరూ కలిసి కార్లలో తిరుగుతూ మందు కొడుతూ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే నాగచైతన్య ఒక అమ్మాయితో కలిసి కారులోనే రొమాన్స్ చేస్తున్నాడట.
ముద్దులు లాగిస్తున్న సమయంలో కారు దగ్గరకు పెట్రోలింగ్ లో భాగంగా తిరుగుతున్న పోలీసులు వచ్చారట. దాంతో కారు అద్దాలు తీసి చూడగా పోలీసులు. లోపల అమ్మాయితో లిప్ లాక్ చేసే పనిలో ఉన్నాడు. దాంతో పోలీసులకు దొరికిపోయాడు. అయితే వాళ్ళని బ్రతిమిలాడి కేసు కాకుండా చూసుకున్నాడు. అప్పటి సంఘటనని ఇప్పడు చెబుతూ తెగ మురిసిపోతున్నాడు నాగచైతన్య.