నందమూరి బాలకృష్ణ తమ తాత అక్కినేని నాగేశ్వర రావు ను కించపరచటంతో గట్టిగానే కౌంటర్ ఇచ్చారు అక్కినేని మనవళ్లు నాగచైతన్య, అఖిల్. తాజాగా ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఎన్టీఆర్ , అక్కినేని , ఎస్వీ రంగారావు తదితర మహా నటులు జాతి గర్వించదగ్గవారు. వాళ్ళను గౌరవించుకోవాలే కానీ అవమానించకూడదు అంటూ బాలయ్యకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
ఇటీవల బాలయ్య నటించిన వీరసింహారెడ్డి చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో విజయోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాగా ఆ వేడుకలో మాట్లాడిన బాలయ్య ఫ్లోలో నాన్నగారి డైలాగులు , ఆ రంగారావు , ఈ రంగారావు అక్కినేని….. తొక్కినేని అంటూ వ్యాఖ్యానించాడు. ఇంకేముంది అగ్గి రాజుకుంది. బాలయ్య మాటలు అక్కినేని అభిమానులను తీవ్రంగా కలిచి వేసాయి.
దాంతో బాలయ్య పై అక్కినేని అభిమానులు ఫైర్ అవుతున్నారు సోషల్ మీడియాలో. ఇక ఇప్పుడేమో అక్కినేని మనవళ్లు నాగచైతన్య, అఖిల్ లు స్పందించారు. బాలయ్య నేరుగా విమర్శించలేదు కానీ బాలయ్య వ్యాఖ్యలను ఉదహరిస్తూ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అక్కినేని వారసులు కౌంటర్ ఇచ్చారు కాబట్టి ఈ వివాదం మరింతగా పెరగడం ఖాయం. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.