హాస్య నటుడు అలీ కూతురు ఎంగేజ్ మెంట్ వైరల్ గా మారింది. హీరోగా , కమెడియన్ గా తెలుగులో వెయ్యికి పైగా చిత్రాల్లో నటించాడు. అలీ జుబేదా ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరికీ ముగ్గురు సంతానం. ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. ఇక పెద్ద అమ్మాయి పేరు ఫాతిమా. దంత వైద్యురాలిగా ఇటీవలే చదువు పూర్తి చేసుకుంది. డెంటల్ డాక్టర్ అయిన తన కూతురుకు పెళ్లి చేయాలని భావించిన అలీ – జుబేదా లు ఓ మంచి సంబంధం చూసి ఎంగేజ్ మెంట్ చేసారు.
ఇక ఈ ఎంగేజ్ మెంట్ తతంగమంతా జుబేదా తన యూట్యూబ్ ఛానల్ లో పెట్టేసింది. అలీ భార్య జుబేదాకు ఓ యూట్యూబ్ ఛానల్ ఉన్న విషయం తెలిసిందే. ఆ ఛానల్ లో పలు కార్యక్రమాలు చేస్తూ 5 లక్షలకు పైగా సబ్ స్క్రయిబర్స్ ని సొంతం చేసుకుంది. ఇక తాజాగా తన కూతురు ఎంగేజ్ మెంట్ ని తన యూట్యూబ్ ఛానల్ లో పెట్టడంతో అది కాస్త వైరల్ గా మారింది. అలీ చిత్ర పరిశ్రమలో చాలామందికి సన్నహితుడు కావడంతో పలువురు సినీ ,రాజకీయ ప్రముఖులు ఈ ఎంగేజ్ మెంట్ కు వచ్చారు. కొత్త జంటని ఆశీర్వదించారు.