
హీరో అల్లరి నరేష్ ఉగ్రం టీజర్ తో షాక్ ఇచ్చాడు. ఉగ్రం టీజర్ కార్యక్రమం AMB మాల్ లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హీరో నాగచైతన్య హాజరవ్వడం విశేషం. నాగచైతన్య ఉగ్రం టీజర్ ను లాంచ్ చేసాడు. ఇక టీజర్ చూసి నాగచైతన్య షాక్ అయ్యాడు. నాగచైతన్య ఒక్కడే కాదు ఈ టీజర్ చూసిన వాళ్లంతా ఆశ్చర్య పోతున్నారు.
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అల్లరి నరేష్ నటిస్తున్నాడు ఈ చిత్రంలో. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర కావడంతో అదే మెయింటెన్ చేసాడు నరేష్. యాక్షన్ సీన్స్ , పవర్ డైలాగ్స్ తో అల్లరి నరేష్ అదరగొట్టాడు. అల్లరి నరేష్ ను ఇలా చూసి భేష్ …… కొత్త నరేష్ ను చూసినట్లుగా ఉందని అంటున్నారు పలువురు సినీ ప్రముఖులు. ఇక నెటిజన్లు కూడా ఇదే ఫీల్ అవుతున్నారు.
విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇంతకుముందు విజయ్ కనకమేడల అల్లరి నరేష్ ల కాంబినేషన్లో నాంది అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. నాంది సూపర్ హిట్ కావడంతో మళ్లీ విజయ్ కనకమేడల కు ఛాన్స్ ఇచ్చాడు అల్లరి నరేష్. అతడి అంచనాలకు తగ్గట్లుగానే అల్లరి నరేష్ ను మరోసారి విభిన్న పాత్రలో చూపించాడు.