
బైక్ యాక్సిడెంట్ జరిగినప్పుడు సాయిధరమ్ తేజ్ దగ్గరకు మొదటగా వెళ్ళింది నేనే ! ఆ సమయంలో ఒక్క రక్తం చుక్క కూడా ఒంటి మీద లేదు . స్పృహలో లేడు ఆ సమయంలో సాయిధరమ్ తేజ్ మళ్ళీ బ్రతుకుతాడో ? లేదో ? అని అనుకున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు అగ్ర నిర్మాత అల్లు అరవింద్.
ఈరోజు సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష ట్రైలర్ విడుదల అయ్యింది. కాగా ఆ కార్యక్రమానికి అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆమధ్య కాలంలో సాయిధరమ్ తేజ్ బైక్ మీద వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆ యాక్సిడెంట్ లో సాయిధరమ్ తేజ్ కోలుకోవడానికి దాదాపు 5 నెలల సమయం పట్టింది. తిరిగి కోలుకున్నాక చేసిన సినిమా ఈ విరూపాక్ష. ఈనెల 21 న విడుదలకు సిద్ధమైంది.






