మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పాన్ వరల్డ్ మూవీ కి ప్లాన్ చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి , నటసింహం నందమూరి బాలకృష్ణ ల మల్టీస్టారర్ కాంబినేషన్ లో పాన్ వరల్డ్ మూవీ తీయాలని కసిగా ఉన్నాడట. ఈ విషయాన్ని అల్లు అరవింద్ అన్ స్థాపబుల్ షోలో వెల్లడించడం విశేషం. త్వరలో ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్ బ్రహ్మాండంగా పేలడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆహా కోసం నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో చేస్తున్న విషయం తెలిసిందే. ఆ షోలో తాజా ఎపిసోడ్ లో అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు , దర్శకులు రాఘవేంద్రరావు, కోదండరామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించి తాజాగా ప్రోమో విడుదల చేశారు. ఆ ప్రోమో లో మెగాస్టార్ చిరంజీవి తో పాటుగా మిమ్మల్ని కలిపి సినిమా చేయాలని ఉందని , అందుకే ఇప్పటి వరకు మీతో సినిమా చేయలేదని అన్నాడు అల్లు అరవింద్. దాంతో వెంటనే స్పందించిన బాలయ్య …… అప్పుడు ఆ సినిమా పాన్ వరల్డ్ సినిమా అవుతుందని అనడం విశేషం. నిజంగానే చిరంజీవి – బాలకృష్ణ ఇద్దరూ కలిసి సినిమా చేస్తే బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే ఎందుకంటే మాస్ హీరోలు మరి. అయితే వీళ్ళ ఇమేజ్ కు తగిన కథ దొరకాలి కానీ రికార్డుల మోత మోగడం ఖాయం. సిల్వర్ స్క్రీన్ పైన ఇద్దరు సింహాల వలె తలపడటం ఖాయం ……. ఒకరు కోదమ సింహం అయితే మరొకరు సమరసింహం మరి.