
డార్లింగ్ ప్రభాస్ ఇప్పటి వరకు టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న టాలీవుడ్ హీరో కాగా ఆ రికార్డ్ ను బద్దలు కొట్టాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తాజాగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించడానికి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. టి. సిరీస్ భూషణ్ కుమార్ ఈ సినిమాకు ఒక నిర్మాత కాగా అల్లు అర్జున్ కు ఈ సినిమాలో నటించడానికి ఏకంగా 125 కోట్లు ఆఫర్ చేశారట.
దాంతో అతడి రెమ్యునరేషన్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యింది. అల్లు అర్జున్ పుష్ప సినిమాకు ముందు వరకు కేవలం 30 కోట్ల లోపు మాత్రమే తీసుకునే వాడు. అయితే మొదటిసారిగా పుష్ప కోసం భారీ రెమ్యునరేషన్ అందుకున్నాడు. పుష్ప భారీ విజయం సాధించడంతో ఇప్పుడు ఏకంగా 100 కోట్లు అందుకుంటున్నాడు పుష్ప 2 కోసం.
ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే సందీప్ రెడ్డి వంగా సినిమాను ఓకే చేసాడు బన్నీ. ఇక ఈ సినిమా కోసం ఏకంగా 125 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. ఈ పారితోషికంతో డార్లింగ్ ప్రభాస్ రికార్డ్ ను బద్దలు కొట్టాడు. ప్రభాస్ కు ఒక్కో సినిమాకు 100 నుండి 120 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. అయితే అల్లు అర్జున్ మాత్రం 125 కోట్లతో టాలీవుడ్ లోనే హయ్యెస్ట్ పెయిడ్ హీరో గా రికార్డ్ సృష్టించాడు. ఇక పుష్ప 2 బ్లాక్ బస్టర్ అయితే ఈ రెమ్యునరేషన్ మరింతగా పెరగడం ఖాయం.