హీరో అల్లు అర్జున్ ఓ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మల్టీప్లెక్స్ త్వరలోనే ఓపెనింగ్ కి రెడీ అవుతోంది. హైదరాబాద్ లోని అమీర్ పేట మెయిన్ సెంటర్ లో ఇంతకుముందు సత్యం థియేటర్ ఉండేది. ఆ సత్యం థియేటర్ ను ఏషియన్ వాళ్లతో కలిసి కొనుగోలు చేసాడు హీరో అల్లు అర్జున్. పాత థియేటర్ ను కూలగొట్టి అక్కడే బ్రహ్మాండంగా పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టించాడు. ఇది సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. త్వరలోనే మంచి ముహూర్తం చూసి ఈ మల్టీప్లెక్స్ ను ప్రారంభించనున్నారట.
మల్టీప్లెక్స్ రంగంలోకి పలువురు హీరోలు దిగుతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు గచ్చిబౌలిలో ” AMB ” అనే మల్టీప్లెక్స్ దిగ్విజయంగా రన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఏషియన్ వాళ్లతో కలిసి ఈ థియేటర్లు రన్ చేస్తున్నాడు మహేష్. అది సక్సెస్ కావడంతో ఏషియన్ వాళ్ళు పలువురు హీరోలతో టై అప్ అవుతూ ఇలాంటివే ప్లాన్ చేస్తున్నారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ” AVD ” అనే మల్టీప్లెక్స్ ను మహబూబ్ నగర్ లో కట్టించిన విషయం తెలిసిందే.
దాంతో అల్లు అర్జున్ కూడా మల్టీప్లెక్స్ రంగంలోకి రావాలనుకున్నాడు. అలాగే పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోలు ఇలా ఇతర రంగాల్లో కూడా పెట్టుబడులు పెడుతున్నారు. అమీర్ పేట విపరీతమైన రద్దీ ఏరియా కాబట్టి అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ & షాపింగ్ కాంప్లెక్స్ బాగానే ఫేమస్ అవ్వడం ఖాయం.