మేము ఆగము అంటూ కోకా కోలా యాడ్ తో ట్రెండ్ క్రియేట్ చేసాడు అల్లు అర్జున్. కొరియన్ గర్ల్స్ తో కోకా కోలా యాడ్ లో అదరగొట్టాడు ఈ హీరో. తెలుగు , హిందీ , ఇంగ్లీష్ లలో కూడా ఈ యాడ్ రూపొందించారు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ యాడ్ వైరల్ గా మారుతోంది. గూగుల్ లో ట్రెండింగ్ లో ఉంది ఈ యాడ్.
పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అంతకుముందు వరకు అల్లు అర్జున్ కేవలం తెలుగు వరకు మాత్రమే పరిమితం. అలాగే మలయాళంలో కాస్త మార్కెట్ ఉండేది. కానీ పుష్ప వచ్చాక ఒక్కసారిగా అల్లు అర్జున్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. సినిమా హిట్ అవ్వడం పక్కన పెడితే …… అల్లు అర్జున్ యాటిట్యూడ్ అలాగే డైలాగ్స్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి.
అల్లు అర్జున్ పలు యాడ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆ కోవలోనే కోకా కోలా యాడ్ కూడా అంగీకరించాడు. ఇక ఈ యాడ్ తో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ అమెరికా పర్యటనలో ఉన్నాడు. అమెరికా నుండి వచ్చిన తర్వాత పుష్ప 2 షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో చాలా జాగ్రత్తలే తీసుకున్నారు దర్శకులు సుకుమార్.
Breaking News