నిఖిల్ హీరోగా నటించిన 18 పేజెస్ ఈనెల 23 న విడుదల అవుతున్న నేపథ్యంలో ఈరోజు డిసెంబర్ 19 న హైద్రాబాద్ లోని JRC కన్వెన్షన్ సెంటర్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హీరో అల్లు అర్జున్ వస్తున్నాడు. నిఖిల్ కోసం అల్లు అర్జున్ వస్తున్నాడా ? అనే అనుమానం వస్తుంది కదా ! నిఖిల్ కోసమే వస్తున్నాడు …… అయితే ఇదే సమయంలో తన తండ్రి అల్లు అరవింద్ కోసం అలాగే తన మిత్రుడు బన్నీ వాసు కోసం వస్తున్నాడు.
అల్లు అరవింద్ , బన్నీ వాసు కోసం రావడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? 18 పేజెస్ చిత్రంలో హీరో నిఖిల్ అయినప్పటికీ ఈ సినిమాను నిర్మించింది అల్లు అరవింద్ , బన్నీ వాసులు కావడం విశేషం. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ చిత్రం రూపొందింది. దాంతో అటు నిఖిల్ కోసం ఇటు తండ్రి కోసం అలాగే స్నేహితుడి కోసం అల్లు అర్జున్ వస్తున్నాడన్న మాట.