34.7 C
India
Friday, April 10, 2026
More

    హీరోగా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న అల్లు అర్జున్

    Date:

    Allu arjun completes 20 years
    Allu arjun completes 20 years

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా 20 ఏళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాడు. అల్లు అర్జున్ హీరోగా నటించిన మొట్ట మొదటి చిత్రం గంగోత్రి. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి చిత్రాన్ని అశ్వనీదత్, అల్లు అరవింద్ , రాఘవేంద్రరావు సంయుక్తంగా నిర్మించడం విశేషం. అల్లు అర్జున్ హీరోగా నటించగా ఆర్తి అగర్వాల్ చెల్లెలు అదితి అగర్వాల్ ను హీరోయిన్ గా పరిచయం చేసారు. ప్రకాష్ రాజ్, సుమన్ , ప్రగతి , సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

    గంగోత్రి చిత్రంలో అల్లు అర్జున్ ని చూసిన వాళ్ళు పెద్ద ఎత్తున విమర్శలు చేసారు. నటన పరంగా విమర్శలు రాలేదు కానీ అల్లు అర్జున్ ఆకారం పట్ల మాత్రం దారుణమైన విమర్శలు వచ్చాయి. సినిమా మంచి హిట్ అయ్యింది. దాంతో అల్లు అర్జున్ తనని తాను మలుచుకున్న తీరుకు ఫిదా అయ్యారు ప్రేక్షకులు. గంగోత్రి నాటి అల్లు అర్జున్ కు పుష్ప నాటి అల్లు అర్జున్ కు చాలా తేడా ఉంది. అదంతా కూడా అల్లు అర్జున్ పడిన కష్టానికి ప్రతిఫలం అనే చెప్పాలి. తానొక స్టార్ ప్రొడ్యూసర్ వారసుడు అయినప్పటికీ ప్రేక్షకులను అలరించాలంటే ఒళ్ళు హూనం అయ్యేలా కష్టపడాల్సిందే అంటూ అలుపెరుగని విధంగా శ్రమిస్తున్నాడు అల్లు అర్జున్. గంగోత్రి సినిమా 2003 , మార్చి 28 న విడుదల కాగా నేటికి ఆ సినిమా విడుదలై 20 ఏళ్ళు పూర్తి కావడంతో తన ఇరవయ్యేళ్ళ నట జీవితాన్ని గుర్తు చేసుకుంటున్నాడు అల్లు అర్జున్. దాంతో అభిమానులు అల్లు అర్జున్ కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

    అల్లు అర్జున్ తాజాగా పుష్ప 2 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తోంది. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే చంద్రబోస్ అద్భుతమైన పాటలను అందించినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో కూడా ఐటమ్ సాంగ్ అదిరిపోయే రేంజ్ లో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Allu Arjun : సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానాన్ని తిరస్కరించిన అల్లు అర్జున్..కారణం ఏమిటంటే!

    Allu Arjun : హైదరాబాద్ చౌమహల్లా ప్యాలెస్‌లో జరిగిన మిస్ వరల్డ్ 2025...

    Allu Arjun : అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో కనిపించనున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్…

    Allu Arjun : అల్లు అర్జున్ మరియు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న పాన్...

    Allu Arjun : అల్లు అర్జున్ సినిమాలో హాట్ బ్యూటీ

    Allu Arjun Heroine : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు జోడీగా ‘సీతారామం’తో...

    Pushpa 2 : ఇదేమి ట్విస్ట్ : ‘పుష్ప 2’ మొత్తం మాయేనా..? సంచలనం రేపుతున్న వీడియో!

    Pushpa 2 : పుష్ప 2' సినిమాకు సంబంధించిన తాజాగా విడుదలైన VFX...