
ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ఆస్కార్ వస్తే యావత్ సినిమా ప్రపంచం పులకించిపోయింది. ఆసేతు హిమాచలం అభినందనల వర్షం కురిపించింది. అయితే హీరో అల్లు అర్జున్ మాత్రం ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ పై స్పందించలేదు ట్వీట్ చేయలేదు దాంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. సరిగ్గా ఇదే సమయంలో అల్లు అర్జున్ ఆర్ ఆర్ ఆర్ గురించి హీరోలు చరణ్ , ఎన్టీఆర్ ల గురించి పొగడ్తల వర్షం కురిపించాడు.
అయితే అల్లు అర్జున్ ట్వీట్ పై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా మరికొందరు మాత్రం సపోర్ట్ చేస్తున్నారు. ఆస్కార్ వంటి గొప్ప పురస్కారం మన తెలుగు సినిమాకు అందునా చరణ్ , ఎన్టీఆర్ లాంటి స్టార్ ల చిత్రానికి వస్తే ఇంత ఆలస్యంగా స్పందిస్తావా ? అంటూ మండిపడుతున్నారు. ఆలస్యంగానైనా స్పందించాడు …… అభినందించాడు అదే సంతోషం.
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. పుష్ప భారీ విజయం సాధించడంతో పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను అందుకోవడానికి భారీ కసరత్తులే చేసాడు దర్శకుడు సుకుమార్.