సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర దుఃఖసాగరంలో మునిగింది. కృష్ణ మరణవార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు కృష్ణకు నివాళి అర్పిస్తున్నారు. అలాగే మహేష్ బాబును పరామర్శిస్తున్నారు.
ఆ కోవలోనే హీరో అల్లు అర్జున్ కూడా కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మహేష్ బాబును పరామర్శించారు. కొద్దిసేపు మహేష్ తో ముచ్చటించి తన సానుభూతి వ్యక్తం చేశారు.