ఎట్టకేలకు పుష్ప 2 ప్రారంభమైంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప మొదటి భాగం గత ఏడాది డిసెంబర్ 17 న విడుదలైన విషయం తెలిసిందే. తెలుగు , తమిళ , మలయాళ , హిందీ , కన్నడ భాషల్లో విడుదలైన పుష్ప అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. పుష్ప భారీ అంచనాలు క్రియేట్ చేయడంతో ఆ అంచనాలను అందుకోవడానికి భారీ సన్నాహాలు చేసారు.
దాంతో కొన్నాళ్ల పాటు ఆలస్యమైంది. ఎట్టకేలకు ఈరోజు హైదరాబాద్ లో పుష్ప 2 చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ నెలాఖరు నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగనుంది. అల్లు అర్జున్ , రష్మిక మందన్న , ఫహద్ ఫాజిల్ , అనసూయ , సునీల్ తదితరులు ఈ రెండో పార్ట్ లో ఉండనున్నారు. ఇక వీళ్ళతో పాటుగా మరికొంతమంది కూడా అదనంగా చేరనున్నారు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా చంద్రబోస్ అన్ని పాటలకు సాహిత్యం అందిస్తున్నాడు. ఇప్పటికే అమెరికాలో మ్యూజిక్ సిట్టింగ్స్ అయిపోయాయి. పాటలన్ని కూడా బాగా వచ్చాయట. అల్లు అర్జున్ మేనరిజం పుష్ప చిత్రానికి హైలెట్ గా నిలిచిన విషయం తెలిసిందే. దాంతో పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా 2023 లో భారీ ఎత్తున విడుదల కానుంది.
Breaking News