ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ షారుఖ్ ఖాన్ సినిమాను రిజెక్ట్ చేసాడని ఊహాగానాలు చెలరేగాయి. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తాజాగా జవాన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. అట్లీ సౌత్ దర్శకుడు కావడంతో అల్లు అర్జున్ చేత ఓ డైనమిక్ పాత్ర ను చేయించాలని అనుకున్నాడు.
అల్లు అర్జున్ కు కలిసి కథ చెప్పాడట కూడా. అయితే అల్లు అర్జున్ మాత్రం ఆ పాత్ర చేయడానికి నిరాకరించినట్లు సమాచారం. షారుఖ్ ఖాన్ తో నటించే గోల్డెన్ ఛాన్స్ వచ్చినందుకు సంతోషం కానీ ఇప్పుడు నా దృష్టి అంతా పుష్ప 2 చిత్రం మీదే ఉందని , ఆసినిమా చేస్తూ మరో సినిమా చేయలేనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడట.
షారుఖ్ ఖాన్ గతకొంత కాలంగా సరైన సక్సెస్ లు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో విడుదలైన చిత్రం పఠాన్. ఈ సినిమా 1000 కోట్ల వసూళ్లను సాధించి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ భారీ విజయాన్ని అందుకుంది. దాంతో జవాన్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ చేస్తే తప్పకుండా బాగుంటుందని అనుకున్నారట. కానీ అల్లు అర్జున్ మాత్రం రిజెక్ట్ చేసి సంచలనం సృష్టించాడు.