భార్యను పక్కన పెట్టుకొని ఆ పని ఏంటి అల్లు అర్జున్ ? అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నువ్ చేసిన పనికి నీ భార్య స్నేహా రెడ్డి బుంగమూతి పెట్టుకుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ కు తగ్గట్లుగానే కొన్ని రకాల స్టిల్స్ అలాగే వీడియో కూడా ఉండటంతో అది కాస్త వైరల్ గా మారింది.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే …….. అల్లు అర్జున్ తన భార్య అల్లు స్నేహా రెడ్డితో కలిసి అమెరికాలో పర్యటించాడు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తవ్వడంతో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరిట ప్రపంచ వ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి. దాంతో న్యూయార్క్ లో కూడా ఈ వేడుకలు జరిగాయి. కాగా ఆ వేడుకలకు తన భార్యతో కలిసి హాజరయ్యాడు అల్లు అర్జున్.
ఆ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో అల్లు అర్జున్ తన భార్యతో కలిసి ప్రజలకు అభివాదం చేస్తూ ఓపెన్ టాప్ వాహనంలో ర్యాలీగా బయల్దేరాడు. అయితే అల్లు అర్జున్ వెనకాలకు వచ్చిన మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సింధూ అల్లు అర్జున్ కు హాయ్ చెప్పింది. దాంతో అల్లు అర్జున్ కూడా హాయ్ చెప్పాడు. అంతేకాదు కాస్త వెనక్కి వంగి మరీ ఆమెకు చేయి ఇవ్వడమే కాకుండా కాస్త దగ్గరకు తీసుకున్నాడు. ఇంకేముంది ఈ సీన్ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి చూసింది. వెంటనే బుంగమూతి పెట్టుకొని పక్కకు తిరిగింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో నెటిజన్లు ఇష్టారీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
Breaking News