Allu Arvind comments on Lavanya యంగ్ డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘బేబీ’.. విజయ్ దేవరకొండ తమ్ముడుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆనంద్ దేవరకొండ.. ఈయన వరుసగా సినిమాలు చేస్తున్నాడు కానీ అంతగా ఇంపాక్ట్ మాత్రం చూపించలేక పోతున్నాడు. వచ్చిన సినిమా వచ్చినట్టు ప్లాప్ అవుతుంది.
అందుకే ఆనంద్ దేవరకొండ కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.. ఈ క్రమంలోనే ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు. ‘బేబీ’ సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీ రోల్స్ పోషిస్తున్నారు. జులై 14న గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ అవుతుండడంతో ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఆ ఈవెంట్ కు అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ ఈవెంట్ లో అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఈయన వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠీ జంట గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
హీరోయిన్ వైష్ణవికి అప్పుడే పెళ్లి చేసుకోవద్దని చాలా చిన్న పిల్లవి ఇంకా కెరీర్ చాలా ఉందని సలహా ఇస్తూ గతంలో లావణ్య త్రిపాఠీకి ఇచ్చిన సలహాను కూడా ప్రస్తావించారు. లావణ్య త్రిపాఠీ మా బ్యానర్ లో మూడు సినిమాల్లో నటించింది అని ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అని అదే చనువుతో ఇక్కడే ఎవరినైనా పెళ్లి చేసుకుని ఉండిపో అంటే తను సీరియస్ గా తీసుకుని మా వాడినే ప్రేమించింది అని నవ్వులు పూయించారు.. కాగా వరుణ్, లావణ్య ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకుని త్వరలోనే పెళ్ళికి రెడీ అవుతున్నారు.